← తిరిగి హోమ్‌కి
తెలంగాణ Nov 02, 2026 • 08:15 AM

నీటి వృథా.. ప్యారడైజ్ హోటల్‌కు రూ.20వేల జరిమానా…

నీటి వృథా.. ప్యారడైజ్ హోటల్‌కు రూ.20వేల జరిమానా…
ఎల్ నినో ఎఫెక్ట్ తో హైదరాబాదు మహానగరంలో నీటి కొరత ఏర్పడిందని భూగర్భ జలాలు తగ్గటంతో ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని త్రాగునీటిని వృధా చేయరాదని ప్రభుత్వం నిబంధనలు విధించినా లక్ష్యపెట్టక భవనం గోడలు, షెడ్డుని కడిగి తాగునీటిని వృధా చేశారన్న ఆరోపణలపై.. ప్యారడైజ్ రెస్టారెంట్‌కు HMWSSB రూ.20 వేల జరిమానా విధించారు. తాగునీటిని దుర్వినియోగం చేసినందుకు సికింద్రాబాద్ హోటల్ ప్యారడైజ్ యాజమాన్యానికి జలమండలి రూ.20 వేల జరిమానా విధించింది.ఖైరతాబాద్ జోన్ పరిధిలోని డివిజన్‌-16 అధికారులు నిర్వహించిన తనిఖీల్లో హోటల్ ప్యారడైజ్‌లో (CAN నంబర్: 612182839) నీటి దుర్వినియోగాన్ని గుర్తించారు. దీంతో రూ.20 వేల జరిమానా విధించడంతో పాటు భవిష్యత్తులో నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని యాజమాన్యానికి సూచించారు.నీటి దుర్వినియోగానికి పాల్పడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని జలమండలి అధికారులు హెచ్చరించారు.

సంబంధిత తాజా వార్తలు