← తిరిగి హోమ్‌కి
తెలంగాణ Nov 04, 2026 • 12:12 PM

ప్రమాదాలకు అడ్డాగా మారిన భద్రాచలం ఐటీడీఏ రోడ్డు

ప్రమాదాలకు అడ్డాగా మారిన భద్రాచలం ఐటీడీఏ రోడ్డు
ప్రమాదాలకు అడ్డాగా మారిన భద్రాచలం ఐటీడీఏ రోడ్డు భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏ రోడ్డుపై నిత్యం వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మార్గంలో పలు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కాగా దురదృష్టవశాత్తూ, మూడు దశాబ్దాలుగా చూడని విధంగా భారీ గుంతలతో ఈ రహదారి పూర్తిగా దెబ్బతిన్నది.నిత్యం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ రహదారిపై ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు

సంబంధిత తాజా వార్తలు